Advertisement
Advertisement
Abn logo
Advertisement

నకిలీ పత్రాలతో కెనరా బ్యాంకుకు టోకరా

ఏలూరు క్రైం, అక్టోబరు 1: నకిలీ ధ్రువీకరణ పత్రాలతో కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుని రూ.338.37కోట్ల మేర మోసగించిన దంపతులు, వారికి సహకరించిన పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రాజమహేంద్రవరానికి చెందిన తోట కన్నారావు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, అతని భార్య వెంకటరమణ డైరెక్టర్‌గా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో శ్రీ కృష్ణా స్టాకిస్ట్‌ అండ్‌ ట్రేడర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014-15లో వేప చెట్ల పెంపకం, విత్తనాలు శుద్ధిచేసి ఔషధాలతయారీ, మొక్కజొన్న విత్తనాల వ్యాపారాలు చేస్తున్నట్టు కొన్ని ఆస్తులు ష్యూరిటీగా చూపించి ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి రూ.35 కోట్లు, ఐడీబీఐ నుంచి రూ.30 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యాపార విస్తరణ కోసం 2015-16లో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో హైదరాబాద్‌ కెనరా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం నుంచి రూ.152కోట్ల రుణం పొందారు. దాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకు సర్కిల్‌ కార్యాలయ జీఎం టి.వీరభద్రారెడ్డి ఢిల్లీలోని సీబీఐకి ఫిర్యాదుచేశారు. వీరిద్దరూ బ్యాంకును మోసగించి రుణం పొందడమే కాకుండా, రూ.338.37 కోట్లు నష్టంవాటిల్లేలా కుట్రపన్నారన్న ఫిర్యాదుపై విచారణ జరిపి, హైదరాబాద్‌లోని సీబీఐ (ఏసీబీ విభాగం)కి కేసు బదిలీ చేశారు. వీరు గురువారం కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement