అమెరికాలో తల్లిని కాల్చి చంపిన పసిబిడ్డ.. జూమ్‌ కాల్‌లో ఉండగానే దుర్ఘటన

ABN , First Publish Date - 2021-08-14T13:26:14+05:30 IST

ఆ పసిబిడ్డ వయసు కొన్ని నెలలు మాత్రమే. నేలపై పాకుతూ.. కనిపించిన తుపాకీని బొమ్మ అనుకుంది. ట్రిగర్‌ నొక్కింది. ఫలితంగా ఆ బిడ్డ తల్లి తలలోకి తూటా దూసుకెళ్లిపోయి, ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది.

అమెరికాలో తల్లిని కాల్చి చంపిన పసిబిడ్డ.. జూమ్‌ కాల్‌లో ఉండగానే దుర్ఘటన

ఫ్లోరిడా, ఆగస్టు 13: ఆ పసిబిడ్డ వయసు కొన్ని నెలలు మాత్రమే. నేలపై పాకుతూ.. కనిపించిన తుపాకీని బొమ్మ అనుకుంది. ట్రిగర్‌ నొక్కింది. ఫలితంగా ఆ బిడ్డ తల్లి తలలోకి తూటా దూసుకెళ్లిపోయి, ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. సదరు తల్లి షమాయా లిన్‌(21) జూమ్‌ కాల్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్‌లో ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తూటాలు నింపిన తుపాకీని లాక్‌ చేయకుండా వదిలేయడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.  


Updated Date - 2021-08-14T13:26:14+05:30 IST