నేటి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-04-03T14:29:30+05:30 IST

హైదరాబాద్: నేటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. దారి తప్పితే రెండేళ్లపాటు జైలుకి పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నేటి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్

హైదరాబాద్: నేటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. దారి తప్పితే రెండేళ్లపాటు జైలుకి పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో 25 వేల లాక్ డౌన్ కేసులు, 34 వేల వాహనాలను అధికారులు సీజ్ చేశారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ సీరియస్ ఆదేశాలు చేసింది. కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా జైలుకే పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెక్షన్ 188 ఐపీసీ, 271 ప్రాణాంతక వ్యాధులు, ప్రాణాలకు ముప్పు, క్వారంటైన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-04-03T14:29:30+05:30 IST