సిక్కోలు నుంచి పంపిణీ ప్రారంభించనున్న సీఎం
మధ్యలో జనం వెళ్లిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీకాకుళం, జూన్ 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా నుంచి సోమవారం ‘అమ్మఒడి’ మూడోవిడత పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం వేదిక గా సీఎం బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా 43.96 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతా ల్లో రూ.6594.6 కోట్ల నగదు జమచేయనున్నారు. తొలుత లబ్ధిదారులతో మాట్లాడిన అనంతరం 11.25 గంటల నుంచి 12.10 గంటలకు బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. 12.15 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా మూడోవిడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ దఫా బహిరంగసభ మధ్యలో జనం వెళ్లిపోకుండా ఏర్పాట్లు చేశారు.