Abn logo
Jun 6 2020 @ 00:00AM

అవాంఛిత రోమాలు తొలగించేందుకు...

కరోనా వైరస్‌ ప్రభావంతో సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితి. ఈ సమయంలో స్పా, పార్లర్‌కు వెళ్లలేకపోతున్నామని బాధపడకండి. ఇంటి వద్దనే అందాన్ని పెంచుకునేందుకు ఇలా చేయండి...

  1. ఓట్స్‌, తేనె, యోగర్ట్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద  స్క్రబ్బర్‌లా రుద్దుకోవాలి. ఇలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా, నిగారింపుతో కనిపిస్తుంది. లేదంటే ఎర్రకంది పప్పును రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే పేస్ట్‌లా చేసుకొని ముఖానికి ఫేస్‌మాస్క్‌లా రాసుకున్నా ముఖం వెలిగిపోతుంది. 
  2. బ్లాక్‌ టీని కురులకు పట్టిస్తే పట్టులా మెరుస్తూ కనిపిస్తాయి. వారంలో రెండు సార్లు షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఇలాచేస్తే ఫలితం ఉంటుంది.
  3. గోళ్లు అందంగా మెరవాలంటే నెయిల్‌ పాలిష్‌తో పాటు మానిక్యూర్‌ తప్పనిసరి. గోళ్ల చివర్లో ఉన్న మృతకణాలను తొలగించి, బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో పాలిష్‌ చేయాలి. దాంతో గోళ్ల దగ్గరి చర్మానికి పోషణ లభిస్తుంది.
  4. కొద్దిసేపు వేడినీళ్లలో చేతులు, పాదాలను ఉంచితే ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిపోతుంది. కండరాల అలసట మాయం అవుతుంది.  
  5. అవాంఛిత రోమాలు తొలగించేందుకు రేజర్‌ అనువైనది కాదు. ఇంట్లో వ్యాక్స్‌ లేకపోతే నిమ్మరసం, చక్కెర, నీళ్లు కలగలిపిన మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట ప్యాక్‌లా రాయాలి. కొద్దిసేపయ్యాక తొలగిస్తే ప్యాక్‌తో పాటు వెంట్రుకలు వచ్చేస్తాయి. 

Advertisement
Advertisement
Advertisement