ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడిస్తే..!

ABN , First Publish Date - 2021-01-21T21:08:04+05:30 IST

ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పూర్తి కావచ్చింది. ముందుగా అనుకున్నట్లుగానే టాప్ జట్లయిన ఇండియా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు టాప్ 4 జట్లుగా నిలిచాయి. ఆ తరువాత ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక ఇప్పటికే ఛాంపియన్‌షిప్...

ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడిస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పూర్తి కావచ్చింది. ముందుగా అనుకున్నట్లుగానే టాప్ జట్లయిన ఇండియా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు టాప్ 4 జట్లుగా నిలిచాయి. ఆ తరువాత ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక ఇప్పటికే ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నుంచి ఇప్పటికే ఇంటిదారి పట్టాయి. అయితే ఈ చాంపియన్‌షిప్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 71.67 విన్నింగ్ పర్సెంటేజ్‌తో 430 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది.  ఆ తర్వాత 70 శాతం విన్నింగ్ పర్సెంటేజ్‌తో న్యూజిలాండ్, 69.19 విన్నింగ్ పర్సెంటేజ్‌తో ఆస్ట్రేలియా, 65.2 విన్నింగ్ పర్సెంటేజ్‌తో ఇంగ్లండ్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 


మరో 75 పాయింట్లు కనుక భారత్ సాధించగలిగితే మిగతా జట్లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్స్‌కు చేరుతుంది. దానికోసం ఛాంపియన్‌షిప్‌లో చివరిగా ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ టీమిండియా ఈ సిరీస్‌లో 4-0, 3-0, 3-1 ఇంగ్లండ్‌ను ఓడిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. అలా కాకున్నా కనీసం 2-0తో అయినా ఇంగ్లండ్‌పై పైచేయి సాధించాలి. అప్పుడే భారత్‌కు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ చేతిలో ఓడితే ఫైనల్ బెర్త్‌ మళ్లీ సంక్లిష్టం అవుతుంది. 


స్వదేశంలోనే భారత్ చేతిలో ఓడిన ఆసీస్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం 332 పాయింట్లతో ఉన్న ఆసీస్ మూడో స్థానంలో ఉంది. దీంతో సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సౌతాఫ్రికాను 3-0 లేదా 2-0 తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో గెలిస్తే ఆసీస్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే భారత్‌కు ఫైనల్ వకాశాలు సుగమమవుతాయి. ఆసీస్ ఇంటికి చేరుతుంది. ఇక ఇంగ్లండ్‌కు కూడా టీమిండియా సిరీస్ ఎంతో ముఖ్యం.  ప్రస్తుతం ఇంగ్లాండ్ 352 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. టీమిండియాపై గెలిస్తేనే ఆ జట్టు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.  ఫైనల్స్​కు అర్హత సాధించాలంటే శ్రీలంకతో జరిగే చివరి టెస్టును గెలవడమే కాకుండా తర్వాత భారత్‌తో సిరీస్​ను గెలుచుకోవాల్సి ఉంటుంది.


కానీ స్వదేశంలో భారత్​కు మంచి రికార్డుంది. గత ఎనిమిదేళ్లలో భారత్ సొంత గడ్డపై ఒకే ఒక టెస్టు ఓడిపోయింది. ఇక పాయింట్ల పట్టికలో 420 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న న్యూజిల్యాండ్ ఇప్పటివరకు 11 మ్యాచ్​లు ఆడిన కివీస్​ 7 గెలిచి నాలుగింటిలో ఓడింది. ఒకవేళ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాపై గెలిచి, టీమిండియా.. ఇంగ్లండ్​ను ఓడిస్తే కివీస్ ఇంటి దారి పడుతుంది. 

Updated Date - 2021-01-21T21:08:04+05:30 IST