ఒత్తిడిని జయించాలంటే..

ABN , First Publish Date - 2022-06-15T07:54:05+05:30 IST

బిజీలై్‌ఫనుంచి కాస్త రిలాక్స్‌ అవ్వండి. ఖాళీగా ఉండటం నేరంగా భావించొద్దు.

ఒత్తిడిని జయించాలంటే..

కెరీర్‌, కుటుంబ బాధ్యతల్లో పడి మహిళలు ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటుంటారు. డబ్బు, కుటుంబం ముఖ్యమే కాని అంతకంటే ఆరోగ్యం గొప్పది. అందుకే బిజీలైఫ్‌ నుంచి రిలాక్స్‌ అవ్వాలి. కొవిడ్‌ కాలంలో ఒత్తిడి మరింత పెరిగింది. దీనిలో నుంచి బయటపడాలంటే మహిళలు తమకు తాము సమయం కేటాయించుకోవాలి. 


బిజీ లైఫ్ నుంచి కాస్త రిలాక్స్‌ అవ్వండి. ఖాళీగా ఉండటం నేరంగా భావించొద్దు. చక్కటి టీ తాగుతూ, మంచి సంగీతం వినటం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. నచ్చిన ఆహారం వండటం లేదా హోటల్‌నుంచి తెప్పించుకోవటం.. ఏదైనా సరే ఇష్టమైన పని చేస్తే ఒత్తిడికి దూరమవుతారు.


ఇంట్లో చికాకులు, కెరీర్‌ ఒత్తిళ్లు.. ఎప్పుడూ ఉండేవే. మానసికంగా స్ర్టాంగ్‌ కావటానికి ప్రయాణాలు చేయాలి. కొత్త ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఒత్తిడి తగ్గుతుంది.


ఫలానా సమయంలో ఫలానా పనులు చేయాలనే టైం టేబుల్‌ పెట్టుకోవద్దు. దాని అనుగుణంగా పనులు కాకుంటే అప్‌సెట్‌ అవ్వాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు వెళ్లాల్సిందే. అయితే ఉన్న సమయాన్ని ఎంజాయ్‌ చేయటం నేర్చుకోవాలి. ప్రతిరోజూ కొత్తగా ఫీలవ్వాలి.


మంచి ఆహారమే శరీరానికి శక్తినిస్తుంది. ఇంట్లో పెద్దలకు, పిల్లలకు హెల్తీ ఫుడ్‌ చేస్తుంటారు. అయితే తనకు ఐరన్‌, క్యాల్షియం ఉండే ఆహారం తినాలని పట్టించుకోరు. అందుకే ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని మహిళలు తీసుకోవాలి.


ఎన్ని డబ్బులొచ్చినా, ఎంత కష్టపడినా.. మంచి నిద్రలేని జీవితం వృథా. తక్కువ సమయం నిద్రపోతే అనేక సమస్యలు కలుగుతాయి. అందుకే రోజుకు కనీసం ఏడు గంటలు తప్పనిసరి. సుఖనిద్ర ఒత్తిళ్లను తగ్గిస్తుంది. 


మెడిటేషన్‌ చేయటం అలవాటు ఉంటే మరీ మంచిది. మనసు ప్రశాంతమవుతుంది.


వ్యాయామంలేని శరీరం బలహీనంగా ఉంటుంది. ఫిట్‌గా ఉండాలి. ఇందుకోసం వాకింగ్‌  చేయాలి. వర్కవుట్స్‌ చేసి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. యోగా మీలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.

Updated Date - 2022-06-15T07:54:05+05:30 IST