ఎన్జీటి ఉత్తర్వులకు విరుద్ధంగా గౌరవెల్లి పనులు: కోదండరామ్

ABN , First Publish Date - 2022-01-30T02:22:29+05:30 IST

అనుమతులు లేకుండా గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు చేయవద్దన్న ఎన్జీటి ఉత్తర్వులకు

ఎన్జీటి ఉత్తర్వులకు విరుద్ధంగా గౌరవెల్లి పనులు: కోదండరామ్

సిద్దిపేట: అనుమతులు లేకుండా గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు చేయవద్దన్న ఎన్జీటి ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేయించాలని చూస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. జిల్లాలోని అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద గుడాటిపల్లి గ్రామ భూ నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్మదా కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు పరిహారం సంపూర్ణంగా ఇవ్వకుండా భూ నిర్వాసితులు ఖాళీ చేయకూడదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.  


Updated Date - 2022-01-30T02:22:29+05:30 IST