తిరుమల: రెండవ ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. లింక్ రోడ్డు సమీపంలో పలుచోట్ల భారీగా రాళ్లు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు భూమిలోకి కుంగిపోయింది. దీంతో రెండవ ఘాట్‌రోడ్డులో రాకపోకలను పూర్తిగా అధికారులు నిలిపివేశారు. రెండ ఘాట్ రోడ్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డు వద్ద టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.