Tirumalaలో చిరుజల్లులు

ABN , First Publish Date - 2022-07-09T02:24:14+05:30 IST

తిరుమలలో శుక్రవారం కూడా చిరుజల్లులు కురిసాయి. బుధవారం నుంచే తిరుమలలో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది.

Tirumalaలో చిరుజల్లులు

తిరుమల: తిరుమలలో శుక్రవారం కూడా చిరుజల్లులు కురిసాయి. బుధవారం నుంచే తిరుమలలో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎండనే మాట లేకుండా అడపాదడపా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతునే ఉంది. శుక్రవారం వేకువజాము నుంచి భారీ ఈదురుగాలు కూడా జతై  ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. నల్లటిమేఘాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండ దర్శనమిచ్చింది.తిరుమలలోని పలు ప్రదేశాలతో పాటు ఘాట్‌రోడ్లలో చిన్నపాటి చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి.  తిరుమలలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో చాలామంది వృద్ధులు దర్శనం తర్వాత చలికి ఉండలేక తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు వరుసగా వర్షం కురుస్తూనే ఉన్న క్రమంలో ఘాట్‌రోడ్లపై ఇంజినీరింగ్‌, ఫారెస్ట్‌, విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టారు. అనుకోకుండా కొండచరియలు విరిగిపడితే వెంటనే స్పందించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. గాలులు వేగంగా వీస్తున్న క్రమంలో భక్తులెవరూ చెట్లకింద ఉండకండి అంటూ బ్రాడ్‌కాస్టింగ్‌లో టీటీడీ ప్రచారం చేస్తోంది. ఘాట్‌రోడ్లలో వాహనదారులు కూడా నెమ్మదిగా ప్రయాణించాలంటూ జీఎన్సీ, అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు. 

Updated Date - 2022-07-09T02:24:14+05:30 IST