TTD: అన్యమత స్టిక్కర్‌తో తిరుమలలో కారు

ABN , First Publish Date - 2022-08-04T01:31:31+05:30 IST

తిరుమల (Tirumala) పవిత్రతకు భంగం వాటిల్లేలా ఓ అన్యమత స్టిక్కర్‌, ప్రతిమలతో తిరుమలలో బుధవారం

TTD: అన్యమత స్టిక్కర్‌తో తిరుమలలో కారు

తిరుమల: తిరుమల (Tirumala) పవిత్రతకు భంగం వాటిల్లేలా ఓ అన్యమత స్టిక్కర్‌, ప్రతిమలతో తిరుమలలో బుధవారం ఓ కారు (Car) ప్రత్యక్షమైంది. సాధారణంగా ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు, ప్రతిమలు, వస్తువులు, రాజకీయపార్టీల జెండాలు, నాయకుల ఫొటోలు తిరుమలకు నిషేధం. ఒకవేళ అలాంటి వాటితో ఎవరైనా తిరుమలకు రావాలని ప్రయత్నిస్తే వాటిని అలిపిరి (Alipiri) చెక్‌పాయింట్‌లోనే భద్రతాసిబ్బంది అడ్డుకోవాలి. అయితే భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమిళనాడు(Tamil Nadu)కు చెందిన ఓ కారు అన్యమత స్టిక్కర్‌, ప్రతిమలతో తిరుమలకు చేరుకుంది. స్థానిక ఎస్‌ఎంసీ వద్ద కారు ఉండటాన్ని స్థానికులు, భక్తులు, మీడియా గుర్తించింది. సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు కారు వద్దకు చేరుకుని స్టిక్కర్‌ను తొలగించారు. అలాగే కారులోపల డాష్‌బోర్డుపై ఉన్న అన్యమత ప్రతిమను కూడా తొలగించారు. భక్తులు ఈ అంశంపై స్పందిస్తూ తిరుమలలో ఇలాంటివి నిషేధం ఉన్నట్టు తమకు తెలియదన్నారు. కాగా, ఇటీవల ఛత్రపతి శివాజీ ప్రతిమను తిరుమలకు అనుమతించలేదంటూ సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేపిన ఘటన మరువక ముందే కారుపై ఈ అన్యమత స్టిక్కర్‌ వ్యవహారం టీటీడీ (TTD)పై విమర్శలకు దారితీసింది.

Updated Date - 2022-08-04T01:31:31+05:30 IST