కర్నూలు: గణేష్ నిమజ్జనం సందర్భంగా అల్లరి మూకలపై గట్టి నిఘా పెడుతున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. నగరంలో శనివారం గణేష్ నిమజ్జనం జరుగుతుందన్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్నటు ఆయన పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపులో డీజేలు, లౌడ్ స్పీకర్లు నిషేధించామన్నారు. నిబంధనలను ఉల్లంఘించిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.