T20 మ్యాచ్ కోసం పటిష్ఠ భద్రత ఏర్పాట్లు: సీపీ మహేశ్ భగవత్

ABN , First Publish Date - 2022-09-23T22:38:18+05:30 IST

మూడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో భారత్‌-ఆస్ట్రేలియా(India-Australia) టీ20 మ్యాచ్‌( T20 match ) జరగబోతోందని.....

T20 మ్యాచ్ కోసం పటిష్ఠ భద్రత ఏర్పాట్లు: సీపీ మహేశ్ భగవత్

హైదరాబాద్: మూడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో భారత్‌-ఆస్ట్రేలియా(India-Australia) టీ20 మ్యాచ్‌( T20 match ) జరగబోతోందని.. ఈ మ్యాచ్ కోసం అన్ని భద్రత ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్(CP Mahesh Bhagwat) తెలిపారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ.. 2500 మంది పోలీసులతో స్టేడియంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశామని, వివిధ యూనిట్లు ఈ భద్రతలో పాల్గొంటాయన్నారు.ఆదివారం ఉదయం నుంచి స్టేడియంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు.రేపు సాయంత్రం నాగపూర్ నుంచి ప్లేయర్స్ వస్తారన్నారు. ప్లేయర్స్ హైదరాబాద్ వచ్చి మ్యాచ్ ముగించుకుని వెళ్లే వరకూ ఇంటెలిజెన్స్ పోలీసులతో ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


మ్యాచ్ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు(Metro train) నడుస్తుందన్నారు.అలాగే సోమవారం ఉదయం 4 గంటల వరకు అదనపు మెట్రో సర్వీసులు, అదనపు బస్సు సర్వీసులు ఉంటాయన్నారు.మ్యాచ్ కోసం 300 నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రౌండ్‌లో కూర్చున్న ప్రతీ వ్యక్తిపై కెమెరాల ద్వారా నిఘా పెడతామన్నారు. మ్యాచ్‌‌కు వచ్చే ప్రేక్షకులు మొబైల్, హెడ్ ఫోన్స్ అనుమతి ఉంటుందన్నారు.కెమెరాలు, బైనక్యులర్, ల్యాప్‌టాప్, సిగరెట్ లైట్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్, వెపన్స్, ఆల్కహాల్ బెవరేజేస్ లాంటి వస్తువులు గ్రౌండ్‌లోకి అనుమతి ఉండదన్నారు.పెట్స్ యానిమల్స్, హెల్మెట్లు, క్రాకర్స్, తినే వస్తువులు కూడా బయట నుంచి తెచ్చుకోవద్దన్నారు. సెల్ఫీ స్టిక్స్, మాదక ద్రవ్యాలు స్టేడియంలోకి అనుమతి ఉండదన్నారు.


ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రేక్షకులను గ్రౌండ్లోకి అనుమతినిస్తామన్నారు. స్టేడియంలో ఆక్టోపస్ యూనిట్స్ రెండు, షార్ప్ షూటర్స్ అందుబాటులో ఉంటాయన్నారు. జేబు దొంగల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్టేడియంలో ఏడు అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు. స్నేక్ క్యాచర్స్‌ కూడా అందుబాటులో ఉంటారన్నారు.బ్లాక్ టికెట్స్ అమ్మే వారిపై పక్కా నిఘా ఉందని, బ్లాక్ టికెట్స్ అమ్ముతునట్టు చూస్తే పోలీసులకు సమాచారం అందిచాలన్నారు. షీ టీమ్స్ కూడా నిఘాలో ఉంటాయని, స్టేడియంలో ఎలాంటి లోపాలు లేకుండా చూస్తామని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు.

Updated Date - 2022-09-23T22:38:18+05:30 IST