రోడ్డు ప్రమాదంలో టైగర్ వుడ్స్‌కు గాయాలు.. స్పందించిన మాజీ అధ్యక్షులు!

ABN , First Publish Date - 2021-02-25T06:19:36+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్.. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. లాస్ ఏం

రోడ్డు ప్రమాదంలో టైగర్ వుడ్స్‌కు గాయాలు.. స్పందించిన మాజీ అధ్యక్షులు!

లాస్ ఏంజిల్స్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్.. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. లాస్ ఏంజిల్స్ కౌంటీలో ఉన్న రాంచో పాలో వద్ద మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో టైగర్ వుడ్స్.. ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, రోడ్డు పక్కన ఉన్న లోకలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనకు రెండు కాళ్లకూ తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టైగర్ వుడ్స్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలువురు ప్రముఖులు స్పందించారు. టైగర్ వుడ్స్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-02-25T06:19:36+05:30 IST