Abn logo
Feb 28 2021 @ 03:16AM

టైగర్‌ 3 ప్రారంభం

సల్మాన్‌ఖాన్‌, కట్రినా కైఫ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’. ఇటీవల ముంబైలోని యశ్‌రాజ్‌పిల్మ్స్‌ స్టూడియోలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సల్మాన్‌ఖాన్‌, కట్రినాకైఫ్‌, ఇమ్రాన్‌హష్మీ, దర్శకుడు మనీష్‌ శర్మ పాల్గొన్నారు. మార్చి 8 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవనుంది. టైగర్‌ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో చిత్రంలో సల్మాన్‌, కట్రినా కైఫ్‌ రా, ఐఎస్‌ఐ ఏజెంట్ల పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement