రూ.1,616కే టికెట్‌ ఇండిగో ‘స్వీట్‌ 16’ ఆఫర్‌

ABN , First Publish Date - 2022-08-04T08:09:03+05:30 IST

విమానయాన సంస్థ ఇండిగో ‘స్వీట్‌ 16’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్‌ ప్రకటించింది. సంస్థను ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా...

రూ.1,616కే టికెట్‌ ఇండిగో ‘స్వీట్‌ 16’ ఆఫర్‌

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో ‘స్వీట్‌ 16’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్‌ ప్రకటించింది. సంస్థను ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్‌ కింద పన్నులతో కలిపి రూ.1,616 ప్రారంభ ధరకే టికెట్‌ అందచేయనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌ శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌ కింద టికెట్‌ బుక్‌ చేసుకునే వారు ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది (2023) జూలై 16 తేదీల మధ్య తమకు అనుకూలమైన రోజును ఎంచుకుని ప్రయాణించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిమిత కాల ఆఫర్‌ కింద ఎన్ని టికెట్లు విక్రయించనున్నది వెల్లడించలేదు. ఇదిలా ఉండగా జూన్‌ 30వ తేదీతో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఇండిగో రూ.1,064 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన నష్టంతో పోల్చితే ఇది 66.5 శాతం తక్కువ. క్యు1 ఆదాయం రూ.13,019 కోట్లకు పెరిగింది. ఇంధన ధరలు నాలుగింతలు పెరిగి రూ.1215 నుంచి రూ.5,990 కావడంతో వ్యయభారం పెరిగినట్టు పేర్కొంది. 


Updated Date - 2022-08-04T08:09:03+05:30 IST