ప్రవాసులకు ప్రయాణ కష్టాలు.. Gulf దేశాలకు భారీగా పెరిగిన విమాన టికెట్ల రేట్లు.. అసలు కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-06-25T02:01:01+05:30 IST

ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు వెళ్లే NRI లకు, అక్కడి నుంచి స్వదేశానికి తిరిగొచ్చేవారికి విమాన టిక్కెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

ప్రవాసులకు ప్రయాణ కష్టాలు.. Gulf దేశాలకు భారీగా పెరిగిన విమాన టికెట్ల రేట్లు.. అసలు కారణమేంటంటే..

ఎన్నారై డెస్క్: ప్రస్తుతం విమాన టిక్కెట్ల ధరలు NRI లకు చుక్కలు చూపిస్తున్నాయి. దోహా నుంచి చెన్నైకి విమాన టిక్కెట్టు ధర ప్రస్తుతం 86 వేల రూపాయల నుంచి 1.4 లక్షల వరకూ ఉంది. దుబాయ్-కొచ్చీ రూట్లో ధరలు 80 వేల వరకూ కూడా వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. విమాన ప్రయాణికుల సంఖ్య కోవిడ్ పూర్వపు స్థితికి చేరుకోవడంతో రద్దీ విపరీతంగా పెరిగిందని ఈ రంగంలోని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ.. డిమాండ్‌కు తగ్గ స్థాయిలో విమాన సర్వీసులు లేకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమవుతోందన్నారు. 


దుబాయ్ మీదుగా పాశ్చాత్య దేశాలకు వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికుల వల్ల కూడా ధరల భారం పెరుగుతోందని చెబుతున్నారు. ఈ వైమానిక మార్గాల్లో విదేశీ సంస్థలే అధికంగా విమాన సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఇక భారత ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటి సర్వీసుల సంఖ్య పరిమితంగానే ఉంటున్నాయట. అయితే.. ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ కుమ్మక్కై ధరలు పెంచుతున్నాయనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. కానీ..దీన్ని కొందరు సమర్థించట్లేదు. పెరిగిన ఇంధన చార్జీల కారణంగా విమాన టిక్కెట్ ధరలు కూడా పెరుగుతున్నాయని టూరిజం ఏజెంట్లు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-25T02:01:01+05:30 IST