మూడు నెలలు... ఆదాయం రూ. 3,648 కోట్లు...

ABN , First Publish Date - 2021-10-29T04:19:41+05:30 IST

టోరెంటో పవర్ షేర్లు దూసుకుపోతున్నాయి. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు టోరెంటో పవర్‌కు ఫుల్ పవర్‌నిచ్చాయి.

మూడు నెలలు... ఆదాయం రూ. 3,648 కోట్లు...

హైదరాబాద్ : టోరెంటో పవర్ షేర్లు దూసుకుపోతున్నాయి. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు టోరెంటో పవర్‌కు ఫుల్ పవర్‌నిచ్చాయి. ఈ క్రమంలో... కంపెనీ షేర్లు జోష్‌లో ఉన్నాయి. గురువారం ఇంట్రా-డేలో బీఎస్ఈలో టోరెంట్ పవర్ షేర్లు ఏడు శాతం పెరిగి, రూ. 535 కు  చేరుకున్నాయి. అంతేకాకుండా... ఈ ఎలక్ట్రిక్ యుటిలిటీస్ కంపెనీ స్టాక్... ఈ ఏడాది అక్టోబరు 12 న దాని రికార్డు గరిష్ట స్థాయి రూ. 544.80 కు దగ్గరగా ట్రేడవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో టోరెంట్ పవర్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం వార్షికంగా 17 శాతం పెరిగి, రూ. 3,648 కోట్లకు చేరుకుంది.


మార్జిన్లు త్రైమాసికంలో 279 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 26.7 శాతానికి చేరుకున్నాయి. పన్ను తర్వాత లాభం గతేడాది త్రైమాసికంలో రూ. 202 కోట్ల నుంచి 82 శాతం పెరిగి రూ. 369 కోట్లకు చేరుకుంది. దేశీయ విద్యుత్తురంగంలో అతిపెద్ద కంపెనీలలో టొరెంట్ పవర్ ఒకటి. ఫ్రాంచైజీ వ్యాపారంలో కంపెనీకి చెందిన ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలను గణనీయంగా తగ్గించడం, ప్రస్తుత త్రైమాసికంలో ప్రధానంగా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల్లో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరగడం తదితర అంశాలు ఈ త్రైమాసికంలో కంపెనీ పనితీరు గణీయంగా పెరగడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. 

Updated Date - 2021-10-29T04:19:41+05:30 IST