అమరావతి కేసు మరో నిమ్మగడ్డ కేసు కాబోతోందా?

ABN , First Publish Date - 2020-08-05T02:10:25+05:30 IST

న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుందనుకున్నాకూడా చాలా అద్భుతంగా ప్రజల గోడును ఆలకిస్తోందనడానికి...

అమరావతి కేసు మరో నిమ్మగడ్డ కేసు కాబోతోందా?

హైదరాబాద్: న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుందనుకున్నాకూడా చాలా అద్భుతంగా ప్రజల గోడును ఆలకిస్తోందనడానికి ఇటీవల కాలంలో కోర్టు తీర్పులే నిదర్శనాలుగా కనబడుతున్నాయి. చాలా రకాలుగా టీడీపీ నాయకుల బెయిల్ విషయంలో కూడా న్యాయం నాలుగుపాదాలపై నడుస్తోందనడానికి కూడా నిదర్శనమే. అలాగే ప్రజల సమస్యలు, కేసుల విషయంలో కూడా కోర్టులు స్పందిస్తున్న తీరు ‘‘ప్రజాస్వామ్యం ఏమైపోతోంది. ప్రజాస్వామ్యం కనబడకుండాపోతోంది. ప్రజాస్వామ్యం నవ్వులపాలవుతోందని బాధపడే ప్రజాస్వామ్య వాదులకు, సామాన్యులకు, పౌరులకు’’ కోర్టులే ఆలంబనగా నిలుస్తోంది. అభాగ్యులపాలిట అభయమిచ్చే ఆలయాలుగా న్యాయస్థానాలు తయారయ్యాయి.


అమరావతి రాజధానికి సంబంధించి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానిని గవర్నర్ ఆపుతారని అందరూ ఆశిస్తే ఆపకుండా ఆమోదముద్ర వేయడం, రేపో, ఎల్లుండో రాజధాని వైజాగ్ వెళ్లిపోతోందనుకున్న సమయంలో రైతులు వేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. విచారణకు స్వీకరించి స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం పదిరోజులపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీళ్లేదని.. ఎక్కడ ఉన్నది అక్కడే ఉండాలి తప్ప.. ఒక్క ఫైలు కూడా కదలడానికి వీళ్లేదని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. కౌంటర్ వేయమని ప్రభుత్వాన్ని అడిగితే  ప్రభుత్వ అడ్వకేట్  పది రోజులు గడువు అడిగారు. ఈ పది రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏం పనులు చేస్తుందోనన్న అనుమానం వ్యక్తమవడంతో ఎక్కడికి కదలడానికి వీళ్లేదని కోర్టు స్పష్టం చేసింది.


ఇది ఒక పెద్ద ఊరట, ఒక పెద్ద భరోసా. 230 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు, మహిళలకు రాజధాని సెంటర్‌లోనే ఉండాలని, గతంలో చెప్పిన వారికి, ఇప్పుడు కోరుకుంటున్నవారికి కూడా ఇది ఒక పెద్ద భరోసా. మాట మార్చే వాళ్లకు అది కంటగింపుగాను, బాధగాను ఉంటే ఉండవచ్చుగాని, నిజానికి అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్రం నలమూలల నుంచి అనుకుంటున్న ప్రజలందరికి ఇది ఒక శుభవార్త ప్రస్తుతానికి. ఈ స్టే తర్వాత ఏమవుతుంది?. ఇంకా విచారణ ఎలా ముందుకెళ్తుంది. కోర్టులు ఎలా స్పందిస్తాయి ఇంకా చాలా చరిత్ర ఉంది. అప్పుడే అవలేదు. తొలి అడుగు సామాన్యుడు, అభాగ్యులు, త్యాగం చేసిన వాళ్ల పట్ల ఉంది. దీంతో ప్రజాస్వామ్యం మీద మళ్లొక్కసారి రేకెత్తాయి.


‘‘అమరావతి కేసు మరో నిమ్మగడ్డ కేసు కాబోతోందా?. రాజధాని తరలింపును నిలిపివేసిన న్యాయస్థానం. అన్ని సర్దుకున్న జగన్ సర్కార్‌కు ఆశనిపాతం. అభాగ్యుల ఆశలకు ఊపిరులూదిన హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వుల నుంచి గవర్నర్ ఏం నేర్చుకుంటారు?’’. అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో పాల్గొన్న ప్రముఖుల విశ్లేషణ ‌వీడియో ద్వారా వీక్షించగలరు. 

Updated Date - 2020-08-05T02:10:25+05:30 IST