Abn logo
Oct 26 2021 @ 17:21PM

హై వాల్యుయేషన్‌లో ఉన్నా...

హైదరాబాద్ : సెప్టెంబరు త్రైమాసికంలో బలమైన నంబర్లను మార్కెట్‌ ముందుంచిన తర్వాత... టీవీఎస్ మోటార్ షేర్లు టాప్‌ గేర్‌లో దూసుకువెళ్లాయి. సోమవారం ట్రేడింగ్‌లో లాభాలను ఒకింత  కోల్పోయినప్పటికీ... ఈ రోజు మాత్రం దాదాపు 2 % మేర పెరగడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్‌(ఈవీ) సెగ్మెంట్‌లో, ప్రత్యేకంగా ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలన్న కంపెనీ నిర్ణయం, ఉత్పత్తి వృద్ధి, సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడుల అంశాలను మార్కెట్‌ అనుకూలంగా చూసింది. దీనికితోడు దేశీయంగా, ఎగుమతి సెగ్మెంట్లలో అమ్మకాలు పెరుగుతాయని, స్టాక్ ప్రైస్‌కు మరింత బలాన్నిస్తుందని భావిస్తున్నారు.