సోషల్ మీడియా నుంచైనా... ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే...

ABN , First Publish Date - 2021-01-21T21:48:58+05:30 IST

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలుకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాలంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నా సరే... ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

సోషల్ మీడియా నుంచైనా... ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే...

న్యూఢిల్లీ : ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలుకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాలంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నా సరే... ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.


అంటే... యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సంపాదించే వారు కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి. వార్షిక టర్నోవర్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షలు దాటితే... ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.


అంతేకాకుండా యోగ టీచర్, స్పిరిట్యువల్ స్పీకర్లు, ప్రైవేటు కోచింగ్ ఫ్యాకల్టీ వంటి వారు కూడా వారి ఆదాయం రూ. 50 లక్షలు దాటితే... ఐటీఆర్‌ ఆడిట్ చేసుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అర్జించే రాబడి సర్వీస్ సెక్టార్ కిందకు వస్తున్నందున... ఇన్‌కమ్ ట్యాక్స్ ఆడిట్ ను తప్పనిసరిగా చేయించుకోవాలి.


కాగా... టర్నోవర్ రూ. 50 లక్షలు దాటినపక్షంలో మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ సోషల్ మీడియా ద్వారా అర్జించే వారు వారి ఖర్చులను రాబడి నుంచి తొలగించి నికరాదాయ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-01-21T21:48:58+05:30 IST