ఆ భూములు రాష్ట్రానికి అప్పగించాలి: తమ్మినేని

ABN , First Publish Date - 2022-06-22T10:20:06+05:30 IST

రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

ఆ భూములు రాష్ట్రానికి అప్పగించాలి: తమ్మినేని

హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. వాటిని పునరుద్దరించాలని, లేదా ఆ స్థలాల్లో కొత్త పరిశ్రమలను ప్రారంభించాలని, వీలు కాకుంటే ఆ స్థలాలను తిరిగి ఇచ్చివేయాలని కోరారు. మూసివేసిన ఐడీపీఎల్‌, హెచ్‌ఏఎల్‌, హెచ్‌ఎంటీ, హెచ్‌సీఎల్‌, డీఆర్‌డీఎల్‌, సీసీఐ లాంటి సంస్థల ఏర్పాటుకు 7,200 ఎకరాల భూమిని రాష్ట్రం కేటాయించిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఈ సంస్థలను ఉద్దేశపూర్వకంగా మూసేసి వాటి ఆస్తులు, భూములను కారుచౌకగా అమ్ముకునేందుకు కేంద్రం సిద్ధపడుతోంందని ఆరోపించారు. ఆ ఆస్తులు రాష్ట్ర ప్రజల సంపద అని, రూ. వేల కోట్ల విలువైన ఈ భూములను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టాలని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ప్రతిఘటించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.  

Updated Date - 2022-06-22T10:20:06+05:30 IST