Flipkart Big Billion Days sale: ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. కొత్త ఫోన్ కొనాలనుకుంటే లక్కీ ఛాన్స్..

ABN , First Publish Date - 2022-09-20T22:39:41+05:30 IST

ఈ-కామర్స్(E-commerce) సంస్థల ఫెస్టివల్ సేల్స్‌కు సమయం ఆసన్నమైంది. కేవలం రెండు రోజుల్లోనే.. అనగా శుక్రవారం (సెప్టెంబర్ 23) నుంచి సేల్స్ షురూ కాబోతున్నాయి.

Flipkart Big Billion Days sale: ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. కొత్త ఫోన్ కొనాలనుకుంటే లక్కీ ఛాన్స్..

ఈ-కామర్స్(E-commerce) సంస్థల ఫెస్టివల్ సేల్స్‌కు సమయం ఆసన్నమైంది. కేవలం రెండు రోజుల్లోనే.. అనగా శుక్రవారం (సెప్టెంబర్ 23) నుంచి భారీ డిస్కౌంట్ సేల్స్ షురూ కాబోతున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్(flipkart) ‘బిగ్ బిలియన్ డేస్ సేల్ -2022’ (big billion days sale), అమెజాన్(amazon) ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2022’ (great indian festival sale) పేరిట ఇప్పటికే అఫీషియల్ పోస్టర్లు, వెబ్‌పేజీలను సిద్ధం చేశాయి. భారీ డిస్కౌంట్లపై ఇప్పటికే పలు సంకేతాలు కూడా ఇచ్చాయి. ఇక సేల్స్  ప్రారంభవ్వడమే తరువాయి. కాగా తక్కువ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు చేజిక్కించుకునే అవకాశం ఉండడంతో వినియోగదారులు కూడా పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ కొనాలనుకునేవారు ఫెస్టివల్ సేల్స్ కోసం వేచిచూస్తుంటారనడంలో అతిశయోక్తి లేదు. భారీ డిస్కౌంట్లు, స్పెషల్ డీల్స్ ఇందుకు కారణం. గతేడాది 2021లో స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు పెద్ద సంఖ్యలో అమ్ముడుపోగా.. అందులో స్మార్ట్‌ఫోన్ల సంఖ్య పెద్ద మొత్తంలో ఉంది. క్రితం ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ల అమ్ముడుపోతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఏయే స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, ప్రత్యేక డీల్స్ అందించనుందో ఓ లుక్కేద్దాం..


బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అందుబాటులో ఉండనున్న స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఫ్లిప్‌కార్ట్ ఇదివరకే వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల భాగస్వామ్యంతో కస్టమర్లకు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనుంది. ఫ్లిప్‌కార్ట్‌పై డిస్కౌంట్లు లభించనున్న రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్ల జాబితా ఇదే..


ఒప్పో ఎఫ్19 ప్రో+ 5జీ

ఒప్పో ఎఫ్19 ప్రో+ 5జీ(Oppo F19 Pro+ 5G) ఫ్లిప్‌కార్ట్‌పై ప్రస్తుత ధర రూ.17,999గా ఉంది. కాగా బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో డిస్కౌంట్‌తో రూ.15,990కు లభించనుంది. ఈ ఫోన్ ‘మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ’  ప్రాసెసర్‌, 4,310 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించనుంది. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ, బ్యాక్ కెమెరా విషయానికి వస్తే ప్రైమరీ కెమెరా 48ఎంపీలుగా ఉంది.


రియల్‌మీ 9 ప్రో 5జీ..

రియల్‌మీ 9 ప్రో 5జీ(Realme 9 Pro 5G) ఈ ఫోన్ అసలు ధర రూ.21,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో రూ.14,999 లకే లభించనుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. బ్యాక్‌ కెమెరా 64ఎంపీ ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించనుంది. ఈ ఫోన్  సన్‌రైజ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, అరోరా గ్రీన్ మూడు వేరియెంట్లలో లభించనుంది. 


షియోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ

షియోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ(Xiaomi 11i HyperCharge 5G) బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌పై రూ.19,999కే లభించనుంది. ఈ ఫోన్‌కు భారీ డిమాండ్ ఉంటుందనే అంచనాలున్నాయి. ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 920 అక్టా-కోర్ ప్రాసెసర్, 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. 108ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా,16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రానుంది.


మోటో జీ82 5జీ

క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్-695 5జీ ప్రాసెసర్‌తో వస్తున్న మోటో జీ82 5జీ(Moto G82 5G) ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.18,499కే అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఫీచర్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచు ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. సెల్ఫీ కెమెరా 16 ఎంపీ, బ్యాక్ కెమెరా 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీగా ఉన్నాయి.


పైనపేర్కొన్న ఫోన్లు మాత్రమే కాకుండా ఐఫోన్11, ఐఫోన్12, ఐఫోన్13 మోడల్స్, సామ్‌సంగ్ ఎస్22+, గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్లపై కూడా ఆఫర్లు లభించనున్నాయి.

Updated Date - 2022-09-20T22:39:41+05:30 IST