పిల్లలతో ఇలా మెలగాలి!

ABN , First Publish Date - 2021-03-04T05:47:21+05:30 IST

పేరెంటింగ్‌ ఎంతో సవాలుతో కూడినది. అయితే పిల్లలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తల్లిదండ్రులు గ్రహించి దాన్ని ఇవ్వగలిగితే ఆ పిల్లల పెరుగుదల ఎంతో వికాసవంతంగా ఉంటుంది

పిల్లలతో ఇలా మెలగాలి!

పేరెంటింగ్‌ ఎంతో సవాలుతో కూడినది. అయితే పిల్లలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తల్లిదండ్రులు గ్రహించి దాన్ని ఇవ్వగలిగితే ఆ పిల్లల పెరుగుదల ఎంతో వికాసవంతంగా ఉంటుంది. 

  • పిల్లల పట్ల తమకున్న ప్రేమను, ఇష్టాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ప్రదర్శిస్తే చిన్నారులు ఎంతో సంతోషిస్తారు. 
  • పేరెంట్స్‌ పిల్లలను తరచూ దగ్గరకు తీసుకుంటూ తమ స్పర్శతో వాళ్లకి భరోసా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులతో పిల్లలు స్నేహితులుగా మెలుగుతారు. చిన్నారుల ప్రవర్తనలో ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తుంది.
  • ‘మీ క్షేమమే మాకు ముఖ్యం, ఎప్పుడూ మీ వెన్నంటే మేం ఉంటాం’ అన్న ఆత్మస్థైర్యాన్ని తమ చేతల ద్వారా పిల్లల్లో కలిగించాలి. 
  • తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తుండడం, ఇతర పని ఒత్తిళ్ల వల్ల పిల్లలతో మాట్లాడడానికి తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కానీ ఇది సరికాదు. తల్లిదండ్రులు పిల్లలతో రోజూ మాట్లాడాలి. వాళ్ల ఆలోచనలు తెలుసుకోవాలి.
  • పిల్లలను ఇతరులతో పోల్చి మాట్లాడకూడదు. ఇది చిన్నారుల మనసును గాయపరుస్తుంది. తల్లిదండ్రులు ఈ ధోరణిని మానకపోతే వయసు పెరిగే కొద్దీ వారిపట్ల చిన్నారుల్లో ప్రతికూల భావాలు పెరుగుతాయి.
  • పిల్లలకు ఎలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఆ రంగంలో వారిని ప్రోత్సహించాలి. 

Updated Date - 2021-03-04T05:47:21+05:30 IST