కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్నమూడో టెస్టులో భారత జట్టు లంచ్ సమయానికి తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఫలితంగా 143 పరుగుల ఆధిక్యం లభించింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ అర్ధ సెంచరీతో అదరగొట్టగా, కెప్టెన్ కోహ్లీ నిదానంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంత్ 51, కోహ్లీ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు సఫారీ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా ఐదు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్‌కు ఓ వికెట్ దక్కింది.
ఇవి కూడా చదవండి