ఈ మొక్కలు స్వచ్ఛమైన గాలినిస్తాయి

ABN , First Publish Date - 2021-06-14T05:58:48+05:30 IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవడం చాలా అవసరం. పెట్స్‌ ఉన్నా, చిన్న పిల్లలు ఉన్నా ఈ మొక్కలు పెంచుకోవడం తప్పనిసరి. ఇంట్లో స్వచ్ఛమైన గాలిని అందించే అలాంటి మొక్కలు...

ఈ మొక్కలు స్వచ్ఛమైన గాలినిస్తాయి

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవడం చాలా అవసరం. పెట్స్‌ ఉన్నా, చిన్న పిల్లలు ఉన్నా ఈ మొక్కలు పెంచుకోవడం తప్పనిసరి. ఇంట్లో స్వచ్ఛమైన గాలిని అందించే అలాంటి మొక్కలు కొన్ని ఈ వారం మీకోసం...


  1. అరేకా ఫామ్‌ : ఈ మొక్క రెండు, మూడు నెలల పాటు సూర్యరశ్మి తగలకపోయినా చనిపోదు. కిటికీల దగ్గర పెంచుకోవచ్చు. రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని గ్రహిస్తుంది. ఈ మొక్కతో గది అందం రెట్టింపవుతుంది. 
  2. రాపిక్‌ ఫామ్‌ : దీన్ని డైనింగ్‌ ఏరియాలో కాకుండా పిల్లలు చదువుకునే ప్రదేశాల్లో, పడకగదుల్లో పెడితే ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తుంది. అరేకాఫామ్‌తో పోలిస్తే ఇది రెట్టింపు ఆక్సిజన్‌ను రాత్రివేళ అందిస్తుంది. పడకగదిలో తప్పక ఉండాల్సిన మొక్క ఇది. 
  3. స్పైడర్‌ ప్లాంట్‌ : ఈ మొక్క గదిలో ఉన్న దుమ్మును గ్రహిస్తుంది. ఆస్తమా, బ్రీతింగ్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్న వాళ్లు ఇంట్లో తప్పక పెంచుకోవాల్సిన మొక్క ఇది. పడకగదిలో మంచం దగ్గర, కిటికీల దగ్గర పెంచుకోవచ్చు. ఇంట్లో కనిపించని దుమ్మును గ్రహించే శక్తి ఈ మొక్కకు ఉంటుంది.
  4. పొథోస్‌ ప్లాంట్‌ (మనీ ప్లాంట్‌) : నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ను దూరం చేసే మొక్క ఇది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర, టీపాయ్‌, స్టడీరూమ్‌ ప్రదేశాల్లో ఈ మొక్కను పెట్టుకోవాలి. టీవీ వాల్‌మౌంట్‌ పైన కూడా పెట్టుకోవచ్చు. 
  5. చింగోనియం : నవజాత శిశువులు ఉన్న ఇంట్లో ఉండాల్సిన మొక్క ఇది. చిల్ట్రన్‌ హాస్పిటల్స్‌లో తప్పక పెంచాల్సిన ప్లాంట్‌ ఇది. ప్యూర్‌ ఆక్సిజన్‌ను ఈ మొక్క అందిస్తుంది. చాలా నెమ్మదిగా పెరుగుతుంది. 
  6. బ్యాంబూ ప్లాంట్‌ : గాలిని శుభ్రం చేసే మొక్క ఇది. ఈ ప్లాంట్‌ ఐదు అడుగులకు మించకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాంబూ మొక్కల్లో ఐదు రకాలున్నాయి. అందులో వారిలైట్‌ బ్యాంబూ ప్లాంట్‌ రకాన్ని ఎంచుకోవాలి. 
  7. సాంగ్‌ ఆఫ్‌ ఇండియా : డైనింగ్‌ టేబుల్‌ దగ్గర, మెట్ల దగ్గర మూలల్లో, డస్ట్‌ ఎక్కువగా ఫామ్‌ అయ్యే ప్రదేశాల్లో పెంచుకోవాలి. దీనికి యాంటీ డస్ట్‌ రిమూవల్‌ ప్లాంట్‌ అని పేరు. ఉష్ణోగ్రతలను సైతం నియంత్రిస్తుంది. 
  8. పీస్‌ లిల్లీ : ఈ మొక్కను ఎలాంటి ప్రదేశంలోనైనా పెట్టుకోవచ్చు. వెలుతురు, చీకటితో సంబంధం లేదు. గది అందాన్ని రెట్టింపు చేస్తుంది. 
  9. జిజీ ప్లాంట్‌ : ఒక వ్యక్తి వదిలిన గాలిని ఈ మొక్క గ్రహిస్తుంది. స్టార్‌ హోటల్స్‌లో రిసెప్షన్‌ ఏరియాలో ఈ మొక్క తప్పనిసరిగా ఉంటుంది.  స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది.
  10. స్నేక్‌ ప్లాంట్‌ : లైబ్రరీలో ఉంచుకోవాల్సిన మొక్క ఇది. పుస్తకాలు పెట్టే గదుల్లో పెట్టుకోవచ్చు. పుస్తకాల వాసనను ఇది గ్రహిస్తుంది. ఈ మొక్కలన్నీ నర్సరీల్లో లభిస్తాయి. ధరలు సైతం రూ.150 నుంచి 500 లోపు దొరుకుతాయి.


- కె.పి. రావు

ప్రముఖ ల్యాండ్‌స్కేప్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌

ఫోన్‌: 8019411199

Updated Date - 2021-06-14T05:58:48+05:30 IST