ఇప్పుడీ అన్నాచెల్లెళ్లు సెన్సేషన్.. పట్టుమని 15ఏళ్లు కూడా లేవుకానీ.. కళ్లుచెదిరే ఆదాయం..

ABN , First Publish Date - 2021-09-12T17:34:42+05:30 IST

కాలక్షేపం కోసం తండ్రి చెప్పిన మాటలను భారత్‌కు చెందిన ఇద్దరు అన్నాచెల్లెళ్లు సీరియస్‌గా తీసుకున్నారు. నెలకు లక్షలాది రూపాయాలను సంపాదిస్తున్నారు. అయితే.. ఏంటి.. గొప్ప. ‘ప్రపంచంలో సంపా

ఇప్పుడీ అన్నాచెల్లెళ్లు సెన్సేషన్.. పట్టుమని 15ఏళ్లు కూడా లేవుకానీ.. కళ్లుచెదిరే ఆదాయం..

ఎన్నారై డెస్క్: కాలక్షేపం కోసం తండ్రి చెప్పిన మాటలను భారత్‌కు చెందిన ఇద్దరు అన్నాచెల్లెళ్లు సీరియస్‌గా తీసుకున్నారు. నెలకు లక్షలాది రూపాయాలను సంపాదిస్తున్నారు. అయితే.. ఏంటి.. గొప్ప. ‘ప్రపంచంలో సంపాదిస్తున్న అన్నాచెల్లెళ్లు చాలా మందే ఉన్నారు. వీరి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం ఏముంది’ అని అనుకుంటున్నారా? అవును.. ఈ అన్నాచెల్లెళ్లు స్పెషలే. ఈ అన్నాచెల్లెళ్ల వయసు పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేదు కాబట్టే ప్రస్తుతం ప్రత్యేకంగా నిలిచారు. 



భారత్‌కు చెందిన 14 ఏళ్ల ఇషాన్ థాకూర్.. తన సోదరి 9ఏళ్ల అనన్య‌తో కలిసి నెలకు సుమారు 32వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. భారత కరెన్సీలో చెప్పాలంటే.. ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్ల సంపాదన నెలకు సుమారు ఇరవై మూడున్నర లక్షలు. టెక్సాస్‌లో నివసిస్తున్న వీరిద్దరికీ.. రాత్రి పడుకునే సమయంలో తన తండ్రి చెప్పే కబుర్లు వినే అలవాటు ఉంది. ఎప్పటిలాగే రాత్రి బెడ్ మీద వాలిపోయిన ఈ అన్నాచెల్లెళ్లకు ఓ తమ తండ్రి ద్వారా క్రిప్టోకరెన్సీ గురించి తెలిసింది. బిట్‌కాయిన్ విలువ భారీగా పెరుగుతున్నట్లు తెలుసుకున్న ఈ తోబుట్టువులు.. క్రిప్టో కరెన్సీ గురించి మరిన్ని విషయాలను తెలుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే.. ఇతేరియం వారి దృష్టిని ఆకర్షించింది. ఇతేరియం ఎప్పటికైనా బిట్‌కాయిన్‌కు గట్టి పోటీగా నిలుస్తందని డిసైడ్ అయ్యారు. 



అంతేకాకుండా ఇతేరియం ద్వారా సంపాదనను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఇతేరియం కొనడానికి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని.. అంత మొత్తం తమ వద్ద లేదని వారు గ్రహించారు. ఈ క్రమంలోనే తమ ఇంట్లో ఉన్న పాత గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి.. ఇతేరియం మైనింగ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. దాంట్లో ఈ అన్నాచెల్లెళ్లు సక్సెస్ అయ్యారు. ఇతేరియం మైనింగ్ ఆపరేషన్ ద్వారా మొదటి నెలలో దాదాపు 1000 డాలర్లను సంపాందించారు. దీంతో మరింత ఉత్సాహంతో ముందడుగు వేశారు. ఈ క్రమంలోనే ప్రపంచాన్ని కరోనా కుదిపేయడంతో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత పుంజుకున్నారు. 


దీంతో ఇతేరియం మైనింగ్ ఆపరేషన్ ద్వారా ప్రస్తుతం నెలకు ఏకంగా 32వేల డాలర్లను సంపాదిస్తున్నారు. తాజాగా ఈ అన్నాచెల్లెళ్లు.. డల్లాస్‌లో ఓ డేటా సెంటర్‌ను కూడా ప్రారంభించారు. చిన్న వయసులోనే భారీ మొత్తంలో ఆర్జిస్తూ ఈ అన్నాచెల్లెళ్లు.. మీడియా దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీరివురూ.. మైనింగ్ ఆపరేషన్ ద్వారా ఆర్జిస్తున్న లాభాలను కాలేజీ చదువుల కోసం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో తాను, యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో తన చెల్లి అనన్య చదవాలనుకుంటున్నట్లు ఇషాన్ థాకూర్ పేర్కొన్నారు. డాక్టర్ అవ్వడమే తమ లక్ష్యమని వివరించాడు. 


Updated Date - 2021-09-12T17:34:42+05:30 IST