credit score: క్రెడిట్ స్కోరుని వేగంగా పెంచుకునే ఉత్తమ మార్గాలివీ.. మీకు తెలుసా? లేదా?

ABN , First Publish Date - 2022-09-21T00:04:39+05:30 IST

క్రెడిట్ కార్డు(credit card) ఉన్నంత మాత్రాన ప్రయోజనాలన్నీ పొందలేరు. మంచి క్రెడిట్ స్కోరు(good credit score)‌ను కలిగివున్న యూజర్లు మాత్రమే సంపూర్ణ లబ్ది పొందుతారు.

credit score: క్రెడిట్ స్కోరుని వేగంగా పెంచుకునే ఉత్తమ మార్గాలివీ.. మీకు తెలుసా? లేదా?

క్రెడిట్ కార్డు(credit card) ఉన్నంత మాత్రాన ప్రయోజనాలన్నీ పొందలేరు. మంచి క్రెడిట్ స్కోరు(good credit score)‌ను కలిగివున్న యూజర్లు మాత్రమే సంపూర్ణ లబ్ది పొందుతారు. ముఖ్యంగా రుణాలకు అర్హత సాధిస్తారు. అంతేకాకుండా రుణ పరిమితి పెరగడంతోపాటు ఇతర క్రెడిట్ కార్డులు కూడా సులభంగా పొందేందుకు దోహదపడుతుంది. తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారని తెలియజెప్పే క్రెడిట్ స్కోర్‌(Credit score)ను ఎంత మెరుగ్గా ఉంటే అంతమంచిది. అవగాహన లేకుండా మంచి క్రెడిట్ స్కోరును నిర్వహించడం ఒకింత సంక్లిష్టమనే చెప్పాలి. అయితే అవగాహనతో అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలను అవలంభిస్తే వేగంగా మంచి స్కోరుని సాధించడం సులభమే. మరి మెరుగైన క్రెడిట్ స్కోరు సాధించడం ఎలా?, అందుకు ఏయే అంశాలు దోహదపడతాయి? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం.. మంచి క్రెడిట్ స్కోరును వేగంగా పెంచుకోవడానికి 3 సులభమైన పద్ధతులు ఉన్నాయి.


1. సకాలంలో చెల్లింపులు

క్రెడిట్ కార్డు స్కోరును మెరుగుపరచాలనుకునే వ్యక్తులు సకాలంలో బకాయిలు, బిల్లులు చెల్లించాలి. చెల్లింపుల్లో ఆలస్యం, బకాయిలను ఎక్కువకాలం కొనసాగిస్తే ప్రతికూల ప్రభావం పడడం ఖాయం. మళ్లీ ఈ ఎఫెక్ట్ నుంచి బయటపడాలంటే చాలాకాలమే పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకపోవడమే ఉత్తమం. అందుకే సకాలంలో బిల్లులు చెల్లించడం చాలా ముఖ్యం. చెల్లింపు తేదీ కంటే ముందుగానే ఖాతాలో నగదు ఉండేలా చూసుకోవాలి. ఇందుకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవడం ఉపయోగకరం. ఇలా కొంతకాలం పాటిస్తే క్రెడిట్ స్కోరు తప్పకుండా వేగంగా మెరుగవుతుంది.


2. క్రెడిట్ రిపోర్టుల సమీక్ష

క్రెడిట్ స్కోరును మెరుగుపరచుకోవడంలో క్రెడిట్ రిపోర్టుల సమీక్ష ఎంతో ముఖ్యమైనది. ఎంపిక చేసిన కాలంలో మీ క్రెడిట్ హిస్టరీని ఈ రిపోర్టులు తెలియజేస్తాయి. కాబట్టి తప్పు ఎక్కడ జరుగుతుందో సులభంగా పసిగట్టొచ్చు. క్రెడిట్ స్కోరును దెబ్బకొడుతున్న ఆ పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్తపడవచ్చు. తద్వారా మీరే మంచి క్రెడిట్ స్కోరుకు బాటలు వేసుకోవచ్చు.


3. కొత్త క్రెడిట్ కార్డుల కోసం త్వరపడొద్దు

కొంతమంది ఒక క్రెడిట్ కార్డు తర్వాత మరో క్రెడిట్ కార్డు కోసం వెంటవెంటనే రిక్వెస్టులు పెడుతుంటారు. వేర్వేరు బ్యాంకుల కార్డుల కోసం ప్రయత్నిస్తుంటారు. అవసరాలు ఎన్నైనా ఉండొచ్చు. అయితే మల్టీపుల్ క్రెడిట్ కార్డు రిక్వెస్టుల కారణంగా క్రెడిట్  స్కోర్‌ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. జీవితమంటేనే అనూహ్య ఘటనలమయం. కాబట్టి ఇలా చేయడం అంటే రుణం తీసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను  దెబ్బతీసుకోవడం అవుతుంది. కాబట్టి వేర్వేరు క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోకపోవడమే ఉత్తమం. ఇప్పటికే కార్డులు ఉంటే వాటికే పరిమితమవ్వడం మంచిది.

Updated Date - 2022-09-21T00:04:39+05:30 IST