Abn logo
Aug 3 2020 @ 20:16PM

కరోనా వైరస్‌ను హతమార్చే ఆయుధం ఉండకపోవచ్చు: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరుగుతున్నప్పటికి.. ఈ మహమ్మరిని హతమార్చే ఆయుధం మాత్రం ఎప్పటికి ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సోమవారం హెచ్చరించింది. ప్రభుత్వాలు, ప్రజలు.. టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఫేస్‌మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ కోరారు. కరోనా బారిన పడకుండా ఉండేలా విజయవంతమైన వ్యాక్సిన్ కోసం అందరం ఎదురుచూస్తున్నామని.. అయితే ఈ మహమ్మారిని హతమార్చే ఆయుధం మాత్రం ప్రస్తుతానికి లేదన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఆయుధం ఉండకపోవచ్చని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. అయితే  ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్యమని.. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య సోమవారం కోటి 80 లక్షలు దాటింది. ఇక ఇప్పటివరకు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 లక్షల 90 వేల మంది మరణించారు. 

Advertisement
Advertisement
Advertisement