అప్పుడు తుమ్మితే సత్యం అనేవాళ్లు.. ఇప్పుడు..:హరీష్ రావు

ABN , First Publish Date - 2020-04-09T16:53:17+05:30 IST

వెనుకటి రోజుల్లో ఎవరైనా తుమ్మితే సత్యం అనేవాళ్లు.. ఇప్పుడు ..

అప్పుడు తుమ్మితే సత్యం అనేవాళ్లు.. ఇప్పుడు..:హరీష్ రావు

వెనుకటి రోజుల్లో ఎవరైనా తుమ్మితే సత్యం అనేవాళ్లు.. ఇప్పుడు ఎవరైనా తుమ్మితే సచ్చాంరా అని అంటున్నారని మంత్రి హరీష్ రావు నవ్వుతూ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు యావత్ ప్రపంచం ఎదుర్కుంటోందని అన్నారు. ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ప్రజల సహకారంవల్ల కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగిందన్నారు.


కరోనా.. కరోనా.. అంటే ఓ ముసలావిడ ఏమందంటే.. కరోనా పేరు మంచిగ ఉందిగాని బిడ్డా.. ఈ చంపుడు మంచిగా లేదని అన్నదని హరీష్‌రావు చెప్పారు. కరోనాకు మందులేదని, ఎవరి ఇంట్లో వాళ్లు ఉండడమే దీనికి మందని అన్నారు.

Updated Date - 2020-04-09T16:53:17+05:30 IST