Abn logo
Aug 13 2020 @ 15:14PM

పాతబస్తీలోని దండు మారెమ్మ ఆలయంలో చోరీ

హైదరాబాద్: పాతబస్తీ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొచి కాలనీలో ఉన్న దండు మారెమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. రోజూ మాదిరిగానే ఈ రోజు కూడా ఉదయం దేవాలయం తెరవగా లోపల ఉన్న హుండీ డోర్ తెరుచుకొని ఉందని.. అందులో డబ్బులు కూడా లేవని ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ రమేష్ తెలిపారు. హుండీని ధ్వంసం చేసి డబ్బులు దొంగలించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. గర్భగుడిలోని హారతి పళ్లెం, గుడి గంట సైతం దొంగతనానికి గురయ్యాయన్నారు. సమాచారం అందుకున్న కాలపత్తర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ అంజయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


Advertisement
Advertisement
Advertisement