సిబ్బంది శ్రేయస్సే ఆర్టీసీకి క్షేమం

ABN , First Publish Date - 2021-08-27T05:54:36+05:30 IST

అసమర్థ విధానాలు, అధికారుల అవినీతి కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. సంస్థను ప్రక్షాళన చేయడం కోసం ప్రభుత్వం విధిగా కొన్ని చర్యలు తీసుకోవాలి...

సిబ్బంది శ్రేయస్సే ఆర్టీసీకి క్షేమం

అసమర్థ విధానాలు, అధికారుల అవినీతి కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. సంస్థను ప్రక్షాళన చేయడం కోసం ప్రభుత్వం విధిగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీని క్రమక్రమంగా ప్రైవేటీకరించే కుట్రపూరిత వైఖరులను విడనాడాలి. ప్రైవేట్‌ బస్సులను అనుమతించడం కానీ, లగ్జరీ బస్సులకు వత్తాసు పలకడం కానీ చేయకుండా పూర్తిగా సంస్థ బస్సులనే నడిపించాలి. సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న డీఏలు మంజూరు చేయడంతో పాటు పీఆర్సీని వెంటనే అమలులోకి తేవాలి. ఉద్యోగ విరమణ వయస్సును గతం మాదిరిగానే 58 ఏళ్లకు తగ్గించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. -ఆర్టీసీ క్రెడిట్ సొసైటీకి రాజీనామా చేసిన ఉద్యోగులకు వారి వాటాను వెంటనే చెల్లించాలి. గతంలో సంస్థ నుంచి రిటైర్‌ అయిన వారికి కనీస పింఛన్‌ 10,000గా ఖరారు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలను పింఛన్‌దారులకు కూడ వర్తింపచేయాలి. ఆంధ్రప్రదేశ్‌ మాదిరి రాష్ట్ర ఆర్టీసీని కూడ ప్రభుత్వంలో విలీనం చేసి అందులోనూ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వం తన అనాలోచిత విధానాలకు స్వస్తి చెప్పి కార్మిక వ్యతిరేకతకు స్వస్తి పలికి అధికారుల కొమ్ము కాయడం కాకుండా కిందిస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించాలి. పనిచేసిన 58 సంవత్సరాల వరకైనా ప్రశాంత పరిస్థితుల్లో ఉద్యోగం చేసే అవకాశం కల్పించి కార్మిక ఉద్యోగ పక్షపాతిగా రుజువు చేసుకోవాలి.

వడ్డేపల్లి మల్లేశం

Updated Date - 2021-08-27T05:54:36+05:30 IST