అది వీఆర్‌ఏ మృతదేహం

ABN , First Publish Date - 2020-08-12T08:59:14+05:30 IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్‌లో చెవులు, ముక్కు కుక్కలు పీక్కుతిన్న వృద్ధుడి మృతదేహం

అది వీఆర్‌ఏ మృతదేహం

  • ‘ఆంధ్రజ్యోతి’ వార్తను చూసి గుర్తించిన కుటుంబసభ్యులు

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 11: ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్‌లో చెవులు, ముక్కు కుక్కలు పీక్కుతిన్న వృద్ధుడి మృతదేహం వీఆర్‌ఏదని తేలింది. ‘ఒంగోలు రిమ్స్‌లో రెండు రోజులుగా వృద్ధుడి మృతదేహం..చెవులు ముక్కు పీక్కుతిన్న కుక్కలు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దానిలో ఫొటోను చూసి కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చి గుర్తించారు. దీంతో మృతుడిని  సింగరాయకొండ మండలం కె.బిట్రగుంటకు చెందిన వీఆర్‌ఏ ఇత్తడి కాంతారావు(60)గా గుర్తించారు. చికిత్స కోసం ఆస్పత్రికి పంపితే అనాథ శవంలా వదిలేసి, కుక్కలు పీక్కుతినేలా చేశారంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. 

Updated Date - 2020-08-12T08:59:14+05:30 IST