Abn logo
Apr 16 2021 @ 20:37PM

అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం బోల్తా

చిత్తూరు: అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనం బోల్తా పడింది. కుప్పం మండలంలోని వాన గుట్టపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వాహనం అదుపు తప్పి బోల్తా  పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమారు 12 టన్నుల బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.