ఎల్‌ఐసీ ఆస్తుల విలువెంతంటే ?

ABN , First Publish Date - 2021-12-23T00:41:51+05:30 IST

భారత జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఆస్తుల విలువెంతో తెలిస్తే... నెరెళ్ళబెట్టకుండా ఉండలేం. త్వరలో ఐపీఓకు రాబోతున్న ఎల్‌ఐసీ... తన ఆస్తిపాస్తుల లెక్కలతో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ‘వావ్’ అనిపించేలా చేసింది.

ఎల్‌ఐసీ ఆస్తుల విలువెంతంటే ?


ముంబై : భారత జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఆస్తుల విలువెంతో తెలిస్తే... నెరెళ్ళబెట్టకుండా ఉండలేం. త్వరలో ఐపీఓకు రాబోతున్న ఎల్‌ఐసీ... తన ఆస్తిపాస్తుల లెక్కలతో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ‘వావ్’ అనిపించేలా చేసింది. ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అధికం. ఈ ఒక్క పాయింటే విదేశీ పెట్టుబడిదారులను ఆకట్టుకుంటోదన్న వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లతో జరిగిన సపమావేశంలో... కంపెనీ నిర్వహణలోని ఆస్తుల చిట్టాను మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. మొత్తంగా రూ. 37 ట్రిలియన్ల లెక్క చూపింది. దేశంలో రెండో అతి పెద్ద బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్ పరిమాణం కంటే, ఎల్‌ఐసీ ఏయూఎం 16.6 రెట్లు ఎక్కువ.


అంటే... ఈ సంస్థ స్థాయి ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సంఖ్యలు ఈ ఏడాది మార్చి 31 నాటివి. ఇపన్పటికి మరింతగా పెరిగి ఉంటాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇండియన్‌ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నికర ఆస్తుల విలువ రూ. 31.43 ట్రిలియన్ల ఏయూఎం(ఈ సంవత్సరం నవంబరు వరకు దాదాపు రూ. 37.3 ట్రిలియన్లు). దీంతో పోల్చినా ఎల్‌ఐసీ ఆస్తుల మొత్తం విలువ 1.2 రెట్లు ఎక్కువ.


ఎల్‌ఐసీ నిర్వహించే ఆస్తులు మన దేశ జీడీపీలో 18.7 శాతానికి సమానం. యూఏఈ, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, పాకిస్థాన్‌ దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. స్టాక్‌ మార్కెట్‌లో ఇతి పెద్ద ఇన్వెస్టర్‌ కంపెనీ ఎల్‌ఐసీనే. ఎన్‌ఎస్‌ఈ లో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌లో సుమారు నాలుగు శాతం విలువైన షేర్లు ఎల్‌ఐసీ  పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితం... అంటే... 1956 లో ప్రారంభమైన ఎల్‌ఐసీ... అప్పటినుంచి 2000 సంవత్సరం  వరకు దేశంలో ఏకైక జీవిత బీమా ప్రొవైడర్‌గా కొనసాగింది. తత్ఫలితంగా... బలమైన బ్రాండ్‌ ఇమేజీని దక్కించుకుంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 286 మిలియన్ పాలసీలను అందించింది.


బ్రాండ్ ఫైనాన్స్ ప్రకారం ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ 8.66 బిలియన్ డాలర్లు. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోర్ 100 కి 84.1. దీనికి ఏఏఏ రేటింగ్‌తో కొనసాగుతోంది. భారత్ లో టాటా గ్రూప్ తర్వాత ఎల్‌ఐసీ రెండో అత్యంత విలువైన బ్రాండ్. ఈ)2021 లో) ఏడాది... బ్రాండ్ ఫైనాన్స్ ర్యాంకింగ్‌లో...  మూడో బలమైన, పదో అత్యంత విలువైన గ్లోబల్‌ ఇన్సూరెన్స్‌ బ్రాండ్‌గా గుర్తింపును పొందింది. 

Updated Date - 2021-12-23T00:41:51+05:30 IST