కిర్లోస్కర్‌ కేసులో యథాతథ స్థితి

ABN , First Publish Date - 2021-07-28T07:00:38+05:30 IST

ఆస్తులకు సంబంధించి కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన వివాదం కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కిర్లోస్కర్‌ కేసులో యథాతథ స్థితి

సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆస్తులకు సంబంధించి కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన వివాదం కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి వెళ్లాలన్న బాంబే హైకోర్టు ఆదేశాలపైనా సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఈ వివాద పరిష్కారం కోసం కిర్లోస్కర్‌ సోదరులు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించడం మంచిదని ధర్మాసనం సూ చించింది. కంపెనీ ప్రయోజనాల రీత్యా చూసినా ‘మధ్యవర్తిత్వం’ సమస్య పరిష్కారానికి మంచి మార్గమని పేర్కొంది.   

Updated Date - 2021-07-28T07:00:38+05:30 IST