బడి బురదకు 70 వేలు వదిలింది!

ABN , First Publish Date - 2022-08-05T17:20:42+05:30 IST

ఆ పాఠశాల భవనం కడగటానికి అక్షరాలా రూ.70వేలు ఖర్చయ్యింది. పాఠశాలకు ఎటువంటి నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయులే తమ సొంత డబ్బుతో ఖర్చుపెట్టారు

బడి బురదకు 70 వేలు వదిలింది!

భారమంతా కూనవరం పాఠశాల ఉపాధ్యాయులదే


కూనవరం, ఆగస్టు 4: ఆ పాఠశాల(school) భవనం కడగటానికి అక్షరాలా రూ.70వేలు ఖర్చయ్యింది. పాఠశాలకు ఎటువంటి నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయు(teachers)లే తమ సొంత డబ్బుతో ఖర్చుపెట్టారు. వారంరోజుల పాటు కూలీలను పెట్టి కడిగిస్తేగాని ఈ పాఠశాల భవనంలో బురదపోలేదు. ఇదంతా ఎందుకంటారా?! ఇటీవల అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు గోదావరి వరద ముంపునకు గురయ్యాయి. వరద తగ్గాక ఆయా భవనాల్లో నడుములోతు బురద చేరింది. ఇంటి యజమానులు కష్టపడి ఇళ్లు కడుక్కున్నారు. ప్రభుత్వ భవనాలను అందులోని సిబ్బందితో కడిగించుకున్నారు. మండల కేంద్రంలోని కూనవరం ఉన్నత పాఠశాలకు ఎలాంటి నిధులు, సిబ్బందీ లేకపోవడంతో.. ఉపాధ్యాయులే తమ సొంతఖర్చులతో పాఠశాలను కడిగించుకోవాల్సి వచ్చింది.

Updated Date - 2022-08-05T17:20:42+05:30 IST