80 డాలర్లకు క్రూడాయిల్‌ ?

ABN , First Publish Date - 2021-06-17T09:05:28+05:30 IST

ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పీపా బ్రెంట్‌ ముడి చమురు ధర బుధవారం 74.73 డాలర్లకు చేరింది. 2019 ఏప్రిల్‌ తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.

80 డాలర్లకు క్రూడాయిల్‌ ?

ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పీపా బ్రెంట్‌ ముడి చమురు ధర బుధవారం 74.73 డాలర్లకు చేరింది. 2019 ఏప్రిల్‌ తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో పెరుగుతున్న డిమాండ్‌, ఒపెక్‌ దేశాలు అనుసరిస్తున్న ఉత్పత్తి కోతలు, అమెరికాలో నిల్వలు ఊహించిన దానికంటే తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిపోతుండటంతో బ్యారల్‌ చమురు ధర త్వరలోనే 80 డాలర్లకు చేరుతుంనే అంచనాలు వినిపిస్తున్నాయి. కాగా  పెరుగుతున్న చమురు ధరలతో భారత్‌ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Updated Date - 2021-06-17T09:05:28+05:30 IST