లఖ్‌నవూ: ఈసారి ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు ఫ్రాంచైజీల్లో ఒకటైన లఖ్‌నవూ తన పేరును ప్రకటించింది. తమ జట్టుకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌గా నామకరణం చేసినట్టు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆర్‌పీఎ్‌సజీ గ్రూప్ సోమవారం ట్వీట్ చేసింది. కేఎల్ రాహుల్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. లీగ్‌లో రెండో కొత్త జట్టయిన అహ్మదాబాద్ తమ పేరును ప్రకటించాల్సి ఉంది.