మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

ABN , First Publish Date - 2021-02-27T05:29:56+05:30 IST

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మాజీ ఎంపీ సీతారాంనాయక్‌

ములుగు, ఫిబ్రవరి 26: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మినీ జాతర జరుగుతున్న సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో శుక్రవారం ప్రత్యేకంగా మాట్లాడారు. దేవుళ్లను సెంటిమెంట్‌గా వాడుకుంటూ దేశ రాజకీయాలు నడుస్తున్నప్పుడు మేడారం జాతరను జాతీయ పండుగగా ఎందుకు గుర్తించరని ప్రశ్నించారు. కోటిమందికిపైగా భక్తులు తరలివచ్చి కుంభమేళా స్థాయిలో  జరిగే మేడారం జాతరపై బీజేపీ సర్కారు చిన్నచూపు చూస్తోందని, ఉత్తర భారతదేశంలో వనజ్‌ పేరుతో జరిగే ఉత్సవాన్ని జాతీయ పండుగగా నిర్వహిస్తున్న ప్రభుత్వం దక్షిణభారత దేశంలో ఉన్న మేడారంపై వివక్ష కనబర్చుతోందని విమర్శించారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.100కోట్లపైగా నిధులను ఖర్చుచేసి ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 2022లో జరిగే మహాజాతరలోపైనా మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని కోరారు.


Updated Date - 2021-02-27T05:29:56+05:30 IST