సంక్షేమ హాస్టళ్ల రూపు మారాలి

ABN , First Publish Date - 2022-08-11T08:55:01+05:30 IST

సంక్షేమ హాస్టళ్ల రూపు మారాలి

సంక్షేమ హాస్టళ్ల రూపు మారాలి

గురుకులాలకూ యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి: సీఎం జగన్‌ 

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల రూపు మారాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బుధవారం సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై సమీక్షలో మాట్లాడు తూ ‘రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు ఎలా ఉన్నాయన్న దానిపై పరిశీలన చేయించా. మనం చేయాల్సింది చాలా ఉంది. దానిపై ఒక కార్యాచరణ ఉండాలి. ఈ ఏడాది అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు-నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి. మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో, అలాంటి వసతులే ఉండాలి. స్కూళ్ల నిర్వహణ నిధుల మాదిరిగానే హాస్టళ్ల నిర్వహణ నిధులను కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి హాస్టల్‌లో వార్డెన్లును నియమించాలి. కమాటి, కుక్‌, వాచ్‌మెన్‌ వంటి ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్లు చర్యలు తీసుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సె ప్ట్‌లో హాస్టల్‌ విద్యార్థుల బాగోగులపై వైద్యుడు దృష్టిపెట్టాలి. డైట్‌ చార్జీలపై పూర్తిగా పరిశీలన చేయాలి. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్‌ చార్జీలను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’ అని సీఎం ఆదేశించారు. 

Updated Date - 2022-08-11T08:55:01+05:30 IST