Abn logo
Mar 26 2020 @ 02:49AM

సంక్షోభం నుంచి బయటపడతాం..

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల విశ్వాసం

న్యూయార్క్‌: రోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఎదుర్కొనే ఆర్థికపరమైన సత్తా మైక్రోసా్‌ఫ్టకు ఉందని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సత్య నాదెళ్ల అన్నారు. ఈ సంక్షోభం నుంచి తాము సులభంగా బయటపడతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  కరోనా వ్యాప్తి మూలంగా అమెరికా, యూర్‌పతోపాటు ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయని, వీటిలో డిమాండ్‌ అలాగే ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కిట్స్‌ డిమాండ్‌ను తీర్చుతున్నామని, సప్లయ్‌ పరంగా పూర్వస్థాయికి చేరుకుంటున్నామని చెప్పారు. ఉత్పత్తుల నాణ్యతతోపాటు వ్యక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement