దుబ్బాకలో ఎన్నికల ప్రచారాన్ని పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2020-09-27T20:45:16+05:30 IST

దుబ్బాకలో ఎన్నికల ప్రచారాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి మనిక్కమ్‌ ఠాగూర్‌ పేర్కొన్నారు...

దుబ్బాకలో ఎన్నికల ప్రచారాన్ని పకడ్బందీగా చేపట్టాలి

ఏఐసీసీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్

హైదరాబాద్‌: దుబ్బాకలో ఎన్నికల ప్రచారాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఏఐసీసీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో చేపట్టాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో 146 గ్రామాలున్నాయని, రెండు గ్రామాలకు ఒక ముఖ్య నాయకున్ని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని ఆయన సూచించారు. ఏడు మండలాలకు ఒక కీలక నేతకు బాధ్యతలు అప్పగించాలని అన్నారు. ఆయా ఎన్నికల్లో నేతలంతా సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఏఐసీసీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ సూచించారు.

Updated Date - 2020-09-27T20:45:16+05:30 IST