రైతు బంధు దరఖాస్తులకు నేడు తుది గడువు

ABN , First Publish Date - 2020-07-05T07:11:56+05:30 IST

రైతు బంధు పథకం ద్వారా ఇంత వరకు ఆర్థిక సహాయం అందని రైతులు దరఖాస్తు చేసుకోవటానికి ఆదివారంతో గడువు ముగియనుంది.

రైతు బంధు దరఖాస్తులకు నేడు తుది గడువు

  • మళ్లీ దరఖాస్తుకు అర్హులైన రైతులు ఐదు లక్షల మంది గుర్తింపు
  • వివరాలు సరిగా లేకపోవడంతో 35వేల మందికి చేరని డబ్బులు
  • ఇప్పటి వరకు 56.94 లక్షల మందికి 7,183 కోట్ల సాయం

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రైతు బంధు పథకం ద్వారా ఇంత వరకు ఆర్థిక సహాయం అందని రైతులు దరఖాస్తు చేసుకోవటానికి ఆదివారంతో గడువు ముగియనుంది. తొలుత ఈ ఏడాది జనవరి 23 వరకు రాష్ట్ర ప్రభుత్వం కటాఫ్‌ తేదీని విధించింది. తర్వాత రైతుల విజ్ఞప్తి మేరకు జూన్‌ 16 వరకు కటాఫ్‌ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జూన్‌ 16 వరకు ప్రభుత్వం జారీచేసిన పట్టా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులంతా అర్హులుగా మారారు. పట్టాదారు పాస్‌ పుస్తకం నంబర్లు, ఖాతా నంబర్లు, ఆధార్‌ నంబర్లు, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ నంబర్లు సరిగా ఇవ్వని రైతులు సుమారు 5 లక్షల మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. సుమారు 35 వేల మంది రైతులకు ప్రభుత్వం నగదు బదిలీ చేసినప్పటికీ.. అకౌంట్‌ నంబర్లు మ్యాచ్‌ కాకపోవటంతో డబ్బులు వెనక్కి వచ్చాయి.


ఈ సమస్యలు, రికార్డులు సరి చేయటానికి జూలై ఐదో తేదీని తుది గడువుగా ప్రకటించారు. సంబంధిత క్లస్టర్‌కు బాధ్యునిగా ఉన్న ఏఈవోకి డాక్యుమెంట్లు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సూచించారు. రైతులు సరైన వివరాలతో నమోదు చేసుకుంటే ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 56,94,185మంది రైతులకు రూ.7,183.67కోట్ల పెట్టుబడి సహాయాన్ని వానాకాలం సీజన్‌కు అందించారు. 

Updated Date - 2020-07-05T07:11:56+05:30 IST