కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి:పెద్ది

ABN , First Publish Date - 2020-06-30T11:46:40+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు

కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి:పెద్ది

నర్సంపేట, జూన్‌ 29 : కరోనా వైరస్‌ కట్టడికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వాసవికల్యాణ మండపంలో సోమవారం పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, మునిసిపాలిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఒక్క పాజిటివ్‌ కేసు లేని నర్సంపేట నియోజకవర్గంలో ముందు నుంచే జాగ్రత్తచర్యలు తీసుకున్నామన్నారు. 


కరోనా వైరస్‌ వ్యాపించిన నగరాలు, పట్టణాలకు చెందిన వ్యక్తులు నర్సంపేటకు రాకుండా కట్టడి చేయడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో మధుసూదన్‌, ఏసీపీ ఫణిందర్‌, ఆర్డీవో పవన్‌కుమార్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌, ఎంపిడీలు, తహసీల్దార్లు, పోలీసులు, వైద్యులు, ఐఎంఎ బాధ్యులు పాల్గొన్నారు.


కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథన్యంలో నర్సంపేటలోని వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు సోమవారం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి స్వచ్ఛంద  లాక్‌డౌన్‌ అమలు చేసేలా చూడాలని ఎమ్మెల్యే పెద్దిని కోరారు. కార్యక్రమంలో కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు దాసరి నర్సింహారెడ్డి, కార్యదర్శి పుట్టా రామస్వామి, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. 


గ్రామీణాభివృద్ధిలో ఈజీఎస్‌దే కీలక పాత్ర

 గ్రామీణాభివృద్ధిలో ఈజీఎస్‌ కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఇరిగేషన్‌, ఐటీడీఎ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి, ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2020-06-30T11:46:40+05:30 IST