ప్రజాస్వామ్య పునాదికి రక్షణగా రాజ్యాంగం

ABN , First Publish Date - 2021-11-27T09:07:54+05:30 IST

భారతదేశంలో ప్రజాస్వామ్య పునాది పరిరక్షణలో రాజ్యాంగం అత్యున్నత పాత్ర పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

ప్రజాస్వామ్య పునాదికి రక్షణగా రాజ్యాంగం

రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : భారతదేశంలో ప్రజాస్వామ్య పునాది పరిరక్షణలో  రాజ్యాంగం అత్యున్నత పాత్ర పోషిస్తోందని  రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన  రాజ్యాంగ దినోత్సవంలో ఆమె మాట్లాడారు.  భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడంలో రాజ్యాంగం సమర్థంగా పనిచేస్తోందన్నారు. రాజ్యాంగ ఔన్యత్యాన్ని,  ఆదర్శాలను, విలువలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపకల్పనలో  బీఆర్‌ అంబేద్కర్‌   కృషిని స్మరించుకున్నారు. రాజ్యాంగ పీఠికను  ప్రముఖులు చదివి వినిపించారు. అంతకు ముందు మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీ్‌షచంద్ర శర్మ, శాసనమండలి చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, వి.ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, వి.శ్రీనివా్‌సగౌడ్‌, సీహెచ్‌. మల్లారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


పేదల హక్కులను పరిరక్షించాలి 

సమాజంలోని అత్యంత పేదప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని గవర్నర్‌ తమిళిసై  పిలుపునిచ్చారు. ఎన్‌ఐఆర్‌డీ క్యాంప్‌సలో శుక్రవారం న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. న్యాయవాదులు పేదల పక్షాన పోరాడాలన్నారు.    శిక్షణ నిర్వాహకులు ప్రాక్టీసింగ్‌ లా సంస్థ, పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ను అభినందించారు.  ప్రాక్టీసింగ్‌ లా సెంటర్‌ డైరెక్టర్‌ రాజరాజేశ్వరి, ఎన్‌ఐఆర్‌డీ పీఆర్‌ డైరెక్టర్‌ నరేంద్రకుమార్‌, గవర్నర్‌ కార్యదర్శి కె.సురేంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


చట్టం పల్లెప్రజల చుట్టంగా మారాలి: 

‘లాప్‌’ వ్యవస్థాపకుడు సునీల్‌కుమార్‌

చట్టం గ్రామీణ ప్రజలకు చుట్టంగా మారినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని లాప్‌ (ల్యాండ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ లా ప్రాక్టిషనర్స్‌, ది రూరల్‌ లా ఫర్మ్‌) సంస్థ వ్యవస్థాపకుడు, భూ చట్టాల నిపుణుడు సునీల్‌కుమార్‌ అన్నారు. రాజ్యాంగం, సంవిధాన్‌ దినోత్సవాల సందర్భంగా  తార్నాకలోని లాప్‌ సంస్థ కార్యాలయంలో ‘గ్రామాలు-రాజ్యాంగం’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాజ్యాంగంలో పేర్కొన్న ఉచిత న్యాయసేవలు పల్లెప్రజలకు చేర్చాలన్నారు. భూ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ప్రముఖ న్యాయవాదులు నిరూ్‌పరెడ్డి,  మేక సురే్‌షరెడ్డి మాట్లాడారు. 


పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చర్యలు : జస్టిస్‌ నవీన్‌రావు 

హైకోర్టులో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జస్టిస్‌ నవీన్‌రావు వెల్లడించారు. హైకోర్టు బార్‌అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. కాలం చెల్లిన కేసులను విభజించేందుకు, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కేసులు వాదించేందుకు న్యాయవాదులను నియమించనున్నట్లు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు  విజయ్‌సేన్‌రెడ్డి, శ్రీసుధ,  రాధారాణి,  ఎం.లక్ష్మణ్‌,  మాధవీదేవి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T09:07:54+05:30 IST