రేపటిలోగా కేంద్రం వైఖరి చెప్పాలి

ABN , First Publish Date - 2022-06-30T09:06:56+05:30 IST

ఎల్‌బీనగర్‌, పంజాగుట్ట, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ

రేపటిలోగా కేంద్రం వైఖరి చెప్పాలి

లేదా మాదిగల ఆగ్రహాన్ని చవిచూడాల్సిందే

ఎమ్మార్పీఎ్‌స నేత మందకృష్ణ హెచ్చరిక 

వర్గీకరిస్తే మూల్యం చెల్లించుకోవాల్పిందే 

2న బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

మాల మహానాడు నేత చెన్నయ్య

ఎస్సీ వర్గీకరణపై ఇరువర్గాల ప్రకటనలు

ఎల్‌బీనగర్‌, పంజాగుట్ట, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇటు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌), అటు మాల మహానాడు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. బుధవారం నగరంలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో ఇరువర్గాల నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని జూలై 1 లోగా స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్‌ చేశారు. 2014లో ఎస్సీ వర్గీకరణపై మోదీ హామీ ఇచ్చినప్పటి ఫొటోతో కూడిన గోడపత్రికను బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జూలై 2న ప్రధాని మోదీ నగరానికి వస్తుండటంతో ఆయనకు ఎస్సీ వర్గీకరణ విషయాన్ని గుర్తు చేసేందుకు సడక్‌బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా? లేకుంటే మాదిగల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు, ఎమ్మార్పీఎస్‌ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు భయపడి ఎస్సీ వర్గీకరణపై ఏ నిర్ణయం తీసుకున్నా దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య హెచ్చరించారు. బుధవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 2న బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి, 3న ఇందిరాపార్కు వద్ద మాలల మహా ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మార్పీఎస్‌ జూలై 1 లోపు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయాలని ప్రధానిపై ఒత్తిడి తేవడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణలో ఎవరు అభివృద్థి చెందారో సర్వే చేయడానికి కమిషన్‌ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-30T09:06:56+05:30 IST