ఎస్సీ, ఎస్టీల కేసులు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-09-17T11:24:10+05:30 IST

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల ను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం. హరిత అన్నారు

ఎస్సీ, ఎస్టీల కేసులు పరిష్కరించాలి

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌


వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 16: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల ను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం. హరిత అన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేద ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం ఎప్పుడు ప్రాధా న్యత ఇస్తుందన్నారు. కమిటీ సభ్యుల వివరాల ను అన్ని మండలాల తహసీల్దార్లకు పంపిస్తా మని తెలిపారు. ప్రతీ నెల జరిగే మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి సభ్యులు హాజరై ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. కేసు నమోదైన వెంటనే విచారణ మొదలుపెట్టి తప్పు చేసిన వారికి శిక్షపడే విధంగా జిల్లా పోలీసులు కృషి చేస్తారన్నారు. భూ సమస్య అయితే పక్కాగా సర్వే నంబరు పూర్తి సమాచారం తెలియజేస్తే త్వరగా పరి ష్కరించడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వవ చ్చని పేర్కొన్నారు. 


వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల ఏసీపీలు వారి పరిధిలో గల ఎస్సీ, ఎస్టీ  కేసుల పురోగ తిని వివరించారు. అనంతరం డీఆర్‌వో హరి సింగ్‌ మాట్లాడుతూ 11 ఎస్సీ, ఎస్టీ బాధితుల కు ఇప్పటి వరకు రూ.16,82,500 నష్టపరిహా రాన్ని అందించామని,మిగతా నాలుగు కుటుం బాలకు చెందిన వారు బ్యాంకుల వివరాలు ఇవ్వకపోవడం వల్ల చెల్లింపు ఆగిపోయిందన్నా రు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సమావేశానికి ఇతర వర్గాలు కూడా హాజరైతే ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కలుగుతుం దని సూచించారు. సమావేశంలో డీసీపీ వెంక టలక్ష్మి, పీడీ సంపత్‌రావు, ఆర్‌డీవోలు, కమిటీ సభ్యులు బొమ్మ కట్టయ్య, బిర్రు మహేందర్‌, యాదగిరి, పి.విజయ్‌కుమార్‌, హుస్సేన్‌, ధరణి సంస్థ శోభవాణి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T11:24:10+05:30 IST