Abn logo
Apr 16 2021 @ 16:30PM

సంచలన వీడియో విడుదల చేసిన రాజధాని రైతు గాంధీ

అమరావతి: సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌర‌వ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మికి అమరావతి రైతు  కంచర్ల గాంధీ తన బాధను వ్యక్తీకరిస్తూ సంచలన వీడియో విడుదల చేశాడు. తమ ఆవేదనను పట్టించుకోవాలంటూ విజయలక్ష్మిని ఆ రైతు వేడుకున్నాడు. "తెలంగాణ రాష్ట్రంలో షర్మిలను అరెస్ట్‌ చేస్తే ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందన్నారు, మరి మీరు చెప్పిన హక్కు ఆంధ్రా ప్రజలకు వర్తించదా" అని  విజయలక్ష్మిని గాంధీ ప్రశ్నించారు. ఇక్కడ మీ అబ్బాయే సీఎంగా ఉన్నారు కదా అని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు రాజధాని మహిళలను తన్నుతున్నారని గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతులపై ఏపీలో పోలీసులు పెట్టని కేసు లేదని ఆయన తెలిపారు. వైసీపీ గౌర‌వ అధ్యక్షురాలిగా ఉన్న మీరు..మంత్రులు, ఎమ్మెల్యేల‌ను పిలిచి ఇలా చేయొద్దని చెప్పాలని విజయలక్ష్మిని గాంధీ కోరాడు. ష‌ర్మిల ఒక్కరోజు దీక్ష చేస్తే ప్రభుత్వమే వ‌చ్చి కారణం అడ‌గాలని తమరు అన్నారని, మరి ఏపీలో 485 రోజులుగా రైతులు దీక్ష చేస్తున్నా ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదని గాంధీ ప్రశ్నించారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఏదీ మంచో, ఏదీ చెడో విజ‌య‌లక్ష్మి చెప్పాలని రైతు గాంధీ కోరారు. 

Advertisement
Advertisement
Advertisement