బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ మరో తిరోగమనంలోకి జారుకుంటున్నట్టు కనిపిస్తోంది. బ్రిటన్‌లో రెండో విడత కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా అక్టోబరుతో పోల్చితే నవంబరు నెలలో ఆర్థిక వ్యవస్థ 2.6 శాతం మేరకు కుంచించుకుపోయింది.